వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కన్నుమూశారు. ఈ రోజు మధ్యాహ్నం పొలంలో పనులు చేస్తుండగా.. కళ్లు తిరిగి కింద పడిపోయిన భాస్కర్ రెడ్డిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.. అయితే, వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. అప్పటికే భాస్కర్ రెడ్డి మృతిచెందినట్టుగా నిర్ధారించారు.