గోదావరిలో అంతకంతకు వరద ఉధృతి పెరుగుతూనే ఉంది.. ఎగువన భద్రాచలం వద్ద గంటగంటకు గోదావరి ప్రవాహం పెరుగుతూ.. మూడో ప్రమాదహెచ్చరిక స్థాయిని దాటుతుండగా.. పోలవరం ముంపు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఇక, ధవళేశ్వరం దగ్గర కాటన్ బ్యారేజీకి భారీ స్థాయిలో వరదనీరు వచ్చిచేరుతోంది.. దీంతో.. అదేస్థాయిలో సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. గోదావరి వరద ఉధృతి కారణంగా ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది..…