రాంచీలో జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్లో 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆట ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 40 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ 24, జైస్వాల్ 16 పరుగులతో ఉన్నారు. కాగా.. ఇంకా భారత్ విజయానికి 152 పరుగులు కావాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 145 పరుగులకు ఆలౌట్ అయింది. భారత స్పిన్లర్లు దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు.
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. 339 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ కోల్పోయి 67 పరుగులు చేసింది. కాగా.. ఆట ముగిసే సమయానికి క్రీజులో క్రావ్లే (29), రెహాన్ అహ్మద్(9) పరుగులతో ఉన్నారు. ఓపెనర్ బెన్ డకెట్ వికెట్‌ను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీశాడు. వ్యక్తిగత స్కోరు 28 పరుగుల వద్ద కీపర్ శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్…
ఉప్పల్ వేదికగా ఇండియా- ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈరోజు మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు కోల్పోయి 316 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లీష్ జట్టు 126 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
మేడారం మహా జాతర మూడవరోజుకి చేరుకుంది. వనమంతా జనంగా మారిపోయింది. ఇవాళ సెలవు రోజు కూడా కావడంతో భక్తులు మేడారంకి పోటెత్తుతున్నారు.ఈ మేడారం మహాజాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జాతర ఏర్పాట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.75 కోట్లు ఖర్చు చేసింది. ఇవాళ సమ్మక్క-సారలమ్మను తెలంగాణ సీఎం కేసీఆర్ దర్శించుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో మేడారంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జాతర బందోబస్తు కోసం 382 సీసీ కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాలతో నిఘా…