గత యేడాది కరోనా కారణంగా థియేటర్లు మూతపడినప్పుడు ఏ హీరో సినిమాలు ఎక్కువగా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి? అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సత్యదేవ్. అతను నటించిన ’47 డేస్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, గువ్వ గోరింక’ చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి. అంతేకాదు… ఈ యేడాది ‘పిట్ట కథలు’ ఆంధాలజీలోనూ సత్యదేవ్ నటించాడు. విశేషం ఏమంటే… కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు తెరచుకోగానే విడుదలైన సినిమా కూడా సత్యదేవ్ దే కావడం! లాయర్ రామచంద్రగా సత్యదేవ్…