తెలంగాణలో రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో షోలు ఆపేస్తున్నామని యాజమాన్యాలు స్వచ్ఛందంగా ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటం, నష్టం ఎక్కువ రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని థియేటర్ నిర్వాహకులు తెలిపారు. ప్రదర్శనల నిలిపివేతపై తాజాగా తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి స్పందించాడు. రోజుకు 4 వేలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ… ‘చిన్న పట్టణాల్లో…