ప్రతి రెండేళ్లకోసారి జరిగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో చిన్న నిర్మాతలంతా ఒక్కటయ్యారు. చదలవాడ శ్రీనివాసరావు, సి.కళ్యాణ్, ప్రసన్నకుమార్ బలపరుస్తున్న మన ప్యానెల్ కు అగ్ర నిర్మాతలైన అల్లు అరవింద్, సురేశ్ బాబు, దిల్ రాజు బలపరుస్తున్న ప్రొగ్రెసివ్ ప్యానల్ మధ్య పోటీ నెలకొంది. ఈ పోటీలో ఎఫ్ డీసీ ఛైర్మన్ గా ఉన్న దిల్ రాజు ఈసీ మెంబర్ గా ఎలా పోటీ చేస్తారని మన ప్యానెల్ ప్రశ్నిస్తోంది.…