Zero Shadow Day: బెంగళూర్‌లో రేపు జీరో షాడో డే జరగబోతోంది. బుధవారం రోజు నగర ప్రజలు ‘జీరో షాడో డే’ని అనుభవించనున్నారు. ఈ సంఘటన రేపు మధ్యాహ్నం 12.17 నుంచి 12.23 మరకు జరుగుతుంది. అప్పుడు సూర్యుడు మన నడినెత్తిపై ఉంటాడు. దీంతో నీడ అనేది కనిపించదు. బెంగళూర్‌తో పాటు కన్యాకుమారి, భోపాల్, హైదరాబాద్, ముంబై ప్రజలు కూడా వేరే రోజుల్లో ఈ జీరో షాడో డేని చూసే అవకాశం ఉంది.
జీరో షాడో డే అంటే ఏమిటి..?
సూర్యుడు సరిగ్గా మన నెత్తిపై ఉన్నప్పుడు జీరో షాడో డే ఏర్పడుతుంది. దీని ఫలితంగా మన నీడను చూడలేం. ఈ దృగ్విషయం సాధారణంగా భూమధ్య రేఖకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో సంభవిస్తుంటుంది. ఇక్క సూర్యుడి కోణం, భూమితో దాదాపుగా లంబంగా ఉంటుంది. ఫలితంగా నీడ అనేది కనిపించడు.
Read Also: Voyager 1: వాయేజర్ 1కి మళ్లీ ప్రాణం.. 24 బిలియన్ కి.మీ నుంచి భూమికి సమాచారం..
భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు, పలు సందర్భాల్లో దాని స్థానం మారుతుంటుంది. ఏడాదిలో రెండు వేర్వేరు సమయాల్లో సూర్యుడు, భూమికి సరిగ్గా నిటారుగా, లంబంగా వస్తాడు. ఆ సమయంలో సూర్య కిరణాలు మన నడినెత్తిపై ఉంటాయి. దీంతో మనం నీడను ఎక్స్‌పీరియన్స్ చేయలేము. ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకారం, +23.5 మరియు -23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్న ప్రదేశాలలో జీరో షాడో డే సంవత్సరానికి రెండుసార్లు ఏర్పడుతుంది.
ఇతర నగరాల్లో జీరో షాడో డే:
* బెంగళూరు: ఏప్రిల్ 24 మరియు ఆగస్టు 18 (స్థానిక మధ్యాహ్నం: 12:17, 12:25)
* హైదరాబాద్: 09 మే మరియు 05 ఆగస్టు (స్థానిక మధ్యాహ్నం: 12:12, 12:19)
* ముంబై: 15 మే మరియు 27 జూన్ (స్థానిక మధ్యాహ్నం: 12:34, 12:45)
* భోపాల్: 13 జూన్ మరియు 28 జూన్ (స్థానిక మధ్యాహ్నం: 12:20, 12:23)
Join us on 24 April to celebrate #ZeroShadowDay #ZSD for locations at #Bengaluru latitude
Measure shadow lengths & check out our cool demos! We will work with Bhopal & Chennai to calculate Earth's diameter and rotation speed!@asipoec @CosmosMysuru @doot_iia @IndiaDST pic.twitter.com/99u9oD3Hy0
— IIAstrophysics (@IIABengaluru) April 22, 2024