టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బోళా శంకర్ చిత్రంలో చిరు చెల్లిగా నటిస్తోంది. మరోపక్క నానితో కలిసి దసరా, సూపర్ స్టార్ మహేష్ సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి. ఇకపోతే కీర్తి సురేష్ సరికొత్తగా గాంధారీ అవతారం ఎత్తింది. చేతికి గోరింటాకు, సాంప్రదాయ దుస్తులను ధరించి చిందులు వేస్తోంది.…