Anti-cheating bill: ప్రభుత్వ రిక్రూట్మెంట్ పరీక్షల్లో పరీక్షా పత్రాల లీక్ వంటి మోసపూరిత పద్ధతులను అరికట్టేందుకు ఉద్దేశించిన యాంటీ చీటింగ్ బిల్లును మంగళవారం లోక్‌సభ ఆమోదించింది. ‘‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు’’ తదుపరి రాజ్యసభ ఆమోదం కోసం వెళ్లింది. రాజ్యసభ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో చట్టంగా మారనుంది.