ఇదిలా ఉంటే, పాకిస్తాన్ మూవీ ఇండస్ట్రీలో బహుబలిగా చెప్పబడుతున్న ‘‘ది లెజెండ్ ఆఫ్ హౌలా జాట్’’ సినిమా భారతదేశంలో విడుదల చేసేందుకు అనుమతి రాలేదు. 2019 నుంచి పాకిస్తాన్‌లో భారతీయ సినిమాల విడుదలపై ఆ దేశం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలోనే ఇండియాలో కూడా ఈ సినిమా విడుదలకు కేంద్రం అనుమతి ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఈ చిత్రం పంజాబ్ లో మాత్రమే అందుబాటులో ఉంటుందని గతంలో కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.