The Legend of Maula Jatt: పాకిస్తాన్ ‘‘బాహుబలి’’ సినిమా.. భారత్‌లో విడుదల బంద్..
- ‘‘ ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్’’ భారత్‌లో విడుదల బంద్..
- అత్యధిక వసూళ్లు సాధించిన పాకిస్తాన్ చిత్రంగా గుర్తింపు..
- రాజ్ ఠాక్రేతో పాటు శివసేన నేతల హెచ్చరిక..
- భారత సినిమాలపై పాకిస్తాన్‌లో నిషేధం..
- దీంతోనే సినిమా విడుదల భారత్‌లో బంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Legend of Maula Jatt::భారత్-పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం సంబంధాలు బాగా లేవు. ఎప్పుడైతా పుల్వామా, ఉరీ, పఠాన్ కోట్ ఉగ్రదాడులు జరిగాయో అప్పటినుంచి ఇరు దేశాలు సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత రెండు దేశాలు సంబంధాలు క్షీణించాయి. ఏకపక్షంగా పాక్, భారత్‌తో వాణిజ్య, వ్యాపార సంబంధాలను రద్దు చేసుకుంటున్నట్లు చెప్పింది. దీని ప్రభావం పాకిస్తాన్ ఇప్పుడు అనుభవిస్తుంది. బయట మార్కెట్ నుంచి అంటే ఇండియా నుంచి యూఏఈ, సౌదీ వెళ్లే వస్తువులనే ఇప్పుడు పాకిస్తాన్ ఎక్కువ ధర పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ మూవీ ఇండస్ట్రీలో బహుబలిగా చెప్పబడుతున్న ‘‘ది లెజెండ్ ఆఫ్ హౌలా జాట్’’ సినిమా భారతదేశంలో విడుదల చేసేందుకు అనుమతి రాలేదు. 2019 నుంచి పాకిస్తాన్‌లో భారతీయ సినిమాల విడుదలపై ఆ దేశం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలోనే ఇండియాలో కూడా ఈ సినిమా విడుదలకు కేంద్రం అనుమతి ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఈ చిత్రం పంజాబ్ లో మాత్రమే అందుబాటులో ఉంటుందని గతంలో కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.
Also Read
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
- Supreme Court: "ఒక్క సెప్టెంబర్‌లోనే 13 అత్యాచారాలు".. ఢిల్లీలో లైంగిక దాడులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
Read Also: Rahul Gandhi: అయోధ్య రామమందిర ప్రారంభం ‘‘డ్యాన్స్’’ ఈవెంట్.. రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు..
కొన్ని రోజుల క్రితం మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరే ఈ సినిమాకు విడుదల చేస్తే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు. మహారాష్ట్రలో సినిమాని ప్రదర్శించడానికి తమ పార్టీ అనుమతించడని ట్వీట్ చేశారు. పాకిస్థానీ చిత్రాలను భారతదేశంలో విడుదల చేయడానికి ఎందుకు అనుమతిస్తున్నారని ఆయన ప్రశ్నించారు మరియు దేశంలో ఎక్కడా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అనుమతించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. శివసేన(ఠాక్రే) నేత ఆనంద్ దూబే కూడా ఈ సినిమా విడుదలపై తన అసమ్మతిని వ్యక్తం చేశారు. ‘పాకిస్థానీ సినిమాను ఇండియాలో విడుదల చేయాల్సిన అవసరం ఏముంది.. మన దేశంలో ఆర్టిస్టులు లేరా.. మనం ఇక్కడ సినిమాలు చేయలేదా?’ అని ప్రశ్నించారు.
భారతదేశంలో పాకిస్తానీ ఆర్టిస్టులపై నిషేధం ఉంది. 2016లో ఉరీ ఉగ్రదాడి తర్వాత భారతీయ సినిమాల్లో నటిస్తున్న పాకిస్తానీ ఆర్టిస్టులపై నిషేధం అమలులోకి వచ్చింది. అంతకుముందు పాకిస్తానీ స్టార్ ఫవాద్ హుస్సేన్ కరణ్ జోహర్ దర్శకత్వం వహించిన ‘‘ఏ దిల్ హై ముష్కిల్’’ సినిమాలో నటించారు. మహిరా ఖాన్ షారూఖ్ ఖాన్ నటించిన రయీస్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు వీరిద్దరు కూడా ‘‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్’’ సినిమాలో ఉన్నారు.
తాజావార్తలు
-
PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
-
Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
-
Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!