టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 2018లో పలువురు సినీ తారలపై నమోదు చేసిన ఆరు కేసులను న్యాయస్థానం కొట్టివేసింది.ఎక్సైజ్ శాఖ సరైన ప్రోసిజర్స్ పాటించలేదని అభిప్రాయపడింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా సరైన ఆధారాలు లేకపోవడంతో కేసులు కొట్టివేసినట్లు పేర్కొంది. సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసును కొట్టివేసినట్లు నాంపల్లి కోర్ట్ ప్రకటించింది.. కాగా 2018 నుంచి టాలీవుడ్ సెలబ్రిటీలే టార్గెట్‌గా ఎక్సైజ్ శాఖ దూకుడు ప్రదర్శించింది. పూరీ జగన్నాథ్,…