అద్భుతాలు అనుకుంటే జరగవు. అవి సంభవించాలి. అలాంటి అద్భుతం ‘బాహుబలి’ విషయంలో సంభవించింది. ఇప్పుడు ‘ట్రిపుల్ ఆర్’ విషయంలో జరుగుతుందనిపిస్తోంది. భారతీయ సినిమా కలెక్షన్లను గురించి చెప్పే సందర్భాలలో ‘నాన్ బాహుబలి’ అని స్పెషల్ గా మెన్షన్ చేయడం మనం చూస్తున్నాం. ఇక మార్చి 25వ తేదీన అది ‘నాన్ ట్రిపుల్ ఆర్’ కలెక్షన్స్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ను వసూలు చేసి ‘బాహుబలి -2’ ఆల్…