మధురలోని శ్రీ కృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆర్డర్ 7 రూల్ 11పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముస్లిం పక్షం దఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ సస్పెన్షన్ పై క్యాట్ ఉత్తర్వులు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిగింది. రెండోసారి ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయటం సరికాదని ఈ నెల8 న క్యాట్ తీర్పు ఇచ్చింది. క్యాట్ ఆదేశాలను ప్రభుత్వం అప్పీల్ చేసింది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచర్లలోని పోలింగ్ కేంద్రంలో దూరి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ1గా చేర్చారు. ఆయన గత కొన్ని రోజులుగా అందుబాటులో లేకపోవడంతో ఆయన కోసం ఏపీ, తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు.