మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్ చేసారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్ట్ లు, చెరువులు, కుంటల్లో పరిస్థితిపై సీయం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీఎం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, వరద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా…
తెలంగాణ రాష్ట్రం సత్తా చాటింది… అభివృద్ధిలో తనకు తానే సాటి అని మరోసారి రుజువు చేసుకుంది.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో 2014-15 నుంచి రాకెట్ వేగంతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న తెలంగాణ.. 2021-22 ఆర్థిక సంవత్సరంలోనూ అగ్రస్థానంలో నిలిచి తమకు తిరుగులేదని నిరూపించుకుంది… ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ (ఎంవోఎస్‌పీఐ) వెల్లడించింది.. 2021-22లో జీఎస్డీపీ వృద్ధిరేటు 14.7 శాతంతో పరుగులు పెట్టి దేశంలోనే నంబర్ 1గా నిలిచింది. తలసరి ఆదాయంలో సైతం 18.8 శాతం…