AP Fake Liquor Case: అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్థన్ అరెస్టు చూసేందుకు అనుమతి ఇవ్వాలని తంబళ్లపల్లెలో ఎక్సైజ్ శాఖ పీటీ వారెంట్ దాఖలు చేసింది.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీని ఏడిపించాలని చూస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎంపీ మిథున్ రెడ్డిను ములాఖత్ లో కలిశారు శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు.. ఈ సందర్భంగా ద్వారకనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. కోర్టులో ఆర్డర్ ఇచ్చినా అన్నింటిలో వేలు పెట్టి చూసే పరిస్థితి కనిపిస్తుందన్నారు.. మిథున్‌రెడ్డిని జైలులో టెర్రరిస్టులు, మావోయిస్టులను చూసినట్టు చూస్తున్నారు అని మండిపడ్డారు..
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పై తాజాగా కేసు నమోదు చేశారు పోలీసులు.. వైసీపీ అధిష్టానం పిలుపుమేరకు వెన్నుపోటు దినం పేరిట పార్టీ శ్రేణులతో కలిసి మొలకలచెరువులో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి.. 300 మందితో ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు మొలకలచెరువు పోలీసులు.