గత కొద్దీ రోజుల నుండి తూర్పు ఆసియా దేశాలను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం తెల్లవారుజామున తైవాన్ లో ఓ శక్తిమంతమైన భూకంపం వణికించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జపాన్ దేశంలో కూడా భూకంపం సంభవించింది. నేటి ఉదయం హోన్షు తూర్పు తీరంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు యూరోపియన్ – మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ వివరాలను వెల్లడించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 6.3గా నమోదైనట్లు వెల్లడించింది. Also…