ముంబై రాజకీయాల్లో దాదాపు పాతికేళ్లపాటు ఏకఛత్రాధిపత్యం వహించిన ఠాక్రే కుటుంబానికి ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కోలుకోలేని దెబ్బ తీశాయి. సుమారు రెండు దశాబ్దాల వైరం తర్వాత, తమ ఉమ్మడి శత్రువైన బీజేపీని అడ్డుకోవడానికి ఉద్ధవ్ ఠాక్రే (Shiv Sena UBT) , రాజ్ ఠాక్రే (MNS) చేతులు కలిపారు. ఈ “ఠాక్రే కలయిక” మరాఠీ ఓటర్లను ఏకం చేస్తుందని, తద్వారా ఆసియాలోనే అత్యంత ధనిక మున్సిపల్ సంస్థ అయిన బీఎంసీపై పట్టు నిలుపుకోవచ్చని వారు ఆశించారు.…