ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడినట్లు అధికారులు ధృవీకరించారు. మొదట బుధవారమే విడుదల కావాల్సి ఉండగా, వివిధ అనివార్య పరిస్థితుల కారణంగా ఇప్పుడు ప్రకటన ఆలస్యం అవుతుంది. మరో రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
Telangana: తెలంగాణలోని అన్ని గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఈరోజు నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ప్రారంభం కానుంది. పోస్టుల వారీగా పరీక్షలు 23వ తేదీ వరకు కొనసాగుతాయి.