తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పేరును టీజీఎస్ఆర్టీసీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్చేసింది. అధికారికంగా బుధవారం రోజు దీనిపై సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, TGSRTCపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారాన్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తీవ్రంగా ఖండించారు.