Texas Gun shooting: అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఓ అఘాంతకుడు 8 ఏళ్ల చిన్నారితో సహా ఐదుగురిని అత్యంత క్రూరంగా కాల్చిచంపాడు. ఈ ఘటన టెక్సాస్‌లోని క్లీవ్‌ల్యాండ్‌లో జరిగింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు శాన్ జాసింటో కౌంటీ షెరీఫ్ పోలీసులు శనివారం వెల్లడించారు. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు వేధింపులకు సంబంధించి ఓ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత, సదరు ప్రాంతానికి పోలీసులు వెళ్లి చూడటంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి…