దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు టెస్టు సిరీస్ గెలవలేదన్న బాధతో ఈ వరుసకు బ్రేక్ వేసేందుకు టీమిండియా కష్టాల్లో పడింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో రెండో రోజు ఘోరంగా వెనుకబడింది. సెంచూరియన్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగుల ఆధిక్యంలో ఉండగా.. ఇంకా 5 వికెట్లు మిగిలి ఉన్నాయి.