టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ టెట్) ఆదివారం జరుగనున్నది. ఇందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత టెట్ జరుగడం ఇది మూడోసారి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే పేపర్-1 కు 3,51,468 మంది, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే పేపర్-2 పరీక్షకు 2,77,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటయ్యేలా మార్పులు చేయడంతో బీఈడీ,…