India on Pak: గతేడాది పాకిస్తాన్‌లో ఇద్దరు ఉగ్రవాదుల్ని గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. అయితే ఈ హత్యల్లో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి ఆరోపించారు. అయితే, పాకిస్తాన్ ఆరోపణల్ని భారత్ తీవ్రంగా ఖండగించింది. పాక్ ఆరోపణలు భారత వ్యతిరేక ప్రచారాన్ని పెంపొందించడానికి తాజా ప్రయత్నమని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
Pakistan: ఇటీవల కాలంలో పాకిస్తాన్‌లో భారత వ్యతిరేక ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా గుర్తుతెలియని వ్యక్తుల చంపుతున్నారు. అయితే ఈ హత్యల వెనక భారత్ ఉందని పాక్ ప్రభుత్వం అంతర్గతంగా అనుకుంటున్నప్పటికీ.. ఎప్పుడూ కూడా బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు. అయితే తొలిసారిగా పాక్ విదేశాంగ కార్యదర్శి సైరస్ సజ్జాద్ భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఇద్దరు భారత ఏజెంట్లు యోగేష్ కుమార్, అశోక్ కుమార్ ఆనంద్‌లు పాకిస్తాన్ గడ్డపై ఇద్దరు పాకిస్తానీలను హత్యల్లో ప్రయేయం ఉందని ఆరోపించారు.