Pakistan: పాకిస్తాన్‌లో భారత వ్యతిరేక ఉగ్రవాదులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా మరో ఇద్దరు భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. నిషేధిత లష్కరే తోయిబాకు చెందిన మహ్మద్ ముజామిల్, నయీమూర్ రెహ్మన్‌లను సియాల్‌కోట్ నగరంలో హతమార్చారు. పోలీస్ యూనిఫాం ధరించిన ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి కాల్చి చంపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దర్ని…
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆదివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో ఒకరు లష్కరే తోయిబా టాప్ కమాండర్ అని భావిస్తున్నారు. ఉగ్రవాదుల మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో అలజడి రేపేందుకు పాకిస్తాన్ ఎప్పుడూ కుయుక్తులు పన్నుతూనే ఉంది. భారత్-పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖను దాటించి ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ లోకి పంపే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే సరిహద్దును ఆనుకుని పాకిస్తాన్ వైపు ఉగ్రవాదలు లాంచింగ్ ప్యాడ్స్ సిద్ధంగా ఉన్నాయి. అదును దొరికితే వారిని భారత్ లోకి పంపేందుకు చూస్తోంది పాకిస్తాన్ ఆర్మీ.
Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్ మరో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతాబలగాలకు కీలక విజయం లభించింది. ఈ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయినట్లు పోలీసులు వెల్లడించారు. కొద్ది రోజుల్లో ఉగ్రవాదులు భారీగా దాడులకు సిద్ధం అవుతున్నారనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. తాజాగా గురువారం ఉదయం బారాముల్లా జిల్లాలోని క్రీరి ప్రాంతంలో వనిగం గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ముం
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) సమీపంలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం కాల్చి చంపినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. శనివారం అర్థరాత్రి జిల్లాలోని బాలాకోట్ సెక్టార్‌లో ఉగ్రవాదులు హతమైనట్లు వారు తెలిపారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో సైన్యం చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసి ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లు అధికారులు తెలిపారు.