Terrorists: ఈ మధ్య కాలంలో మధ్య ప్రదేశ్‌లో వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారిని కేంద్ర నిఘా సంస్థ ఎన్‌ఐఏ అరెస్టు చేస్తోంది. అందులో భాగంగా విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం జబల్‌పూర్‌లోని 13 ప్రాం తాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేసి, జేఎంబీ ఉగ్రసంస్థకు చెందిన వారిని అరెస్టు చేసింది. ఇదే నెలలో హిజ్బ్ ఉత్ తహ్రీర్‌కు చెందిన 16 మందిని తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, భోపాల్ యాంటీ టెర్రరిస్టు స్కాడ్ పోలీసులు అరెస్టు చేశారు. హెచ్‌యూటీ…
Terrorists arrested: జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్రకు పాల్పడిన టెర్రరిస్టులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు ఆయుధాలు సరఫరా చేస్తున్న ఐదుగురు హిజ్బుల్ ముజాహిదీన్ సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు.
జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగ్గురు సాయుధ హైబ్రిడ్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారి వద్ద నుంచి 3 ఏకే 47 రైఫిల్స్, 2 పిస్టల్స్, 9 మ్యాగజైన్లు, 200 రౌండ్స్ తూటాలను స్వాధీనం చేసుకున్నారు.
దేశంలో మరో టెర్రర్ మాడ్యూల్ బయటపడింది. ఆల్ ఖైదాతో పాటు గ్లోబల్ టెర్రర్ సంస్థలతో సంబంధం ఉన్న ఆరోపణపై అస్సాంలో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా అన్సరుల్లా బంగ్లా టీమ్ తో సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల బీహార్ లో పీఎఫ్ఐ ఉగ్రకుట్ర బయటపడిన నేపథ్యంలో అస్సాంలో మరో ఉగ్రవాద కుట్ర వెలుగులోకి రావడం కలవరానికి గురిచేస్తోంది. ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్న 11 మందిలో ఒకరు రాష్ట్రంలోని మదర్సా టీచర్ కూడా ఉన్నాడు.