Manipal University : బెంగుళూరులో ఓ స్టూడెంట్ ను ప్రొఫెసర్ టెర్రరిస్టు అని పిలవడం వైరల్ అయింది. చివరకు అతడు సస్పెండుకు గురయ్యారు. మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒక ప్రొఫెసర్ తరగతిలో ఒక ముస్లిం విద్యార్థిని ‘టెర్రరిస్ట్’గా పిలిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సంస్థ ఆ ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసింది. వీడియోలో, విద్యార్థి ప్రొఫెసర్‌ను క్లాస్‌లో ‘ఉగ్రవాది’ అని పిలిచినప్పుడు అతడు ఎదురు తిరిగాడు. ‘26/11 తమాషా కాదు, ముస్లింలుగా ఉండి ఈ దేశంలో ఇలాంటి వాటిని ఎదుర్కోవడం తమాషా కాదు’. ఆ విద్యార్థి తన కొడుకులాంటి వాడని టీచర్ బదులివ్వగా.. ‘‘లేదు.. తండ్రి అలా చెబితే అది అతనిపైనే.. తమాషా కాదు. అయితే ఒక తండ్రి లాగా తాను అంటున్నానని ఆ ప్రొఫెసర్ చెప్పాడు.
Read Also: Shraddha Walker: శ్రద్ధ హత్యకేసులో పోలీసుల ముందడుగు.. మరో ఆయుధం స్వాధీనం
దీంతో ఆ విద్యార్థి మరింత రెచ్చిపోయాడు. ‘నీ కొడుకుతో అలా మాట్లాడతారా? టెర్రరిస్ట్ అంటారా? ఇంత మంది ముందు నన్ను అలా ఎలా పిలుస్తారు? ఇది ఒక క్లాస్, నేర్పించే ప్రొఫెషనల్ మీరు. మీరు నన్ను అలా ఎలా అంటారు? నన్ను అలా పిలవద్దు’ అని ఆ విద్యార్థి సమాధానం ఇచ్చాడు. చివరకు ప్రొఫెసర్ ఆ విద్యార్థికి క్షమాపణలు చెప్పాడు. కాగా, క్లాస్‌లోని ఒక విద్యార్థి తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ ప్రైవేట్ విద్యా సంస్థ చర్యలు చేపట్టింది. ముస్లిం విద్యార్థిని ఉగ్రవాది అన్న ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసింది. వారిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది. ఆ విద్యార్థికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు… ఒక ప్రొఫెసర్ నుంచి అలాంటి మాటను ఊహించని ఆ విద్యార్థి నిజంగానే ఆందోళన చెందాడని పేర్కొంది. అయితే ఈ వీడియోను ఎవరు రికార్డు చేసి లీక్ చేశారో మాత్రం తమకు తెలియదంది.
A Professor in a class room in India calling a Muslim student ‘terrorist’ – This is what it has been to be a minority in India!
We hope the professor at Manipal University (@MAHE_Manipal) near Udupi in Karnataka regrets this.#Manipal #Education #Islamophobia #news #Indiannews pic.twitter.com/EZxOvYu1eG
— News ink Paper (@NewsinkPaper) November 28, 2022