ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియానికి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) అధికారిక ఇమెయిల్‌కు ఒక బెదిరింపు మెయిల్ వచ్చింది. "మీ స్టేడియంను మేము పేల్చివేస్తాం" అని రాసి ఉంది. ఈ మెయిల్ 'పాకిస్థాన్' పేరుతో పంపారు. ఆ తర్వాత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ బెదిరింపు వచ్చింది.…