Teppa Samudram: సింగర్ కమ్ లిరిసిస్ట్ పెంచల్ దాస్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అరవింద సమేతలో రెడ్డమ్మ తల్లి అని ఏడిపించినా.. శ్రీకారం సినిమాలో భలేగుంది బాలా అంటూ అమ్మాయిని ఆటపట్టించినా.. కృష్ణార్జున యుద్ధంలో దారి చూడు దుమ్ము చూడు మామ అంటూ హుషారెత్తించినా.. పెంచల్ దాస్ కె చెల్లింది. ఎన్నో పాటలు ఆయన చేతినుంచి జాలువారాయి..