బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం, పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య తాత్కాలిక ప్రభుత్వం శనివారం ఒక పెద్ద అడుగు వేసింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌పై నిషేధం ప్రకటించింది. ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడే ఉద్దేశ్యంతో ఈ నిషేధం విధించినట్లు చెబుతున్నారు. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌లో అవామీ లీగ్, దాని నాయకులపై జరుగుతున్న విచారణ…
గతేడాది ఆగస్టు నెలలో షేక్ హసీనా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ ప్రధాని పదవిని వీడిన ఆమె భారత్‌లో తలదాచుకునేందుకు వచ్చారు. ప్రస్తుతం మన దేశంలోనే ఆశ్రయం పొందుతున్నారు. అయితే.. హసీనా ప్రభుత్వ పతనం అనంతరం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో మరోసారి తిరుగుబాటు జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్థానిక మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలపై స్పందించిన బంగ్లా సైన్యం ఇప్పటికే తీవ్రంగా…
Bangladesh : బంగ్లాదేశ్ లో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు బాగోలేదు. అక్కడ శాశ్వత ప్రభుత్వం లేదు. యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. రాను రాను ఆ ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత మొదలవుతుంది.