అయోధ్యలో సంప్రోక్షణానంతరం శ్రీ రామనవమి వేడుకలను తొలిసారిగా కొత్త ఆలయంలో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే రామ నవమికి సంబంధించి ఆలయ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లను చేసింది. ఇదిలా ఉండగా.. రాంలల్లా జన్మదినోత్సవం ఈనెల 17 నుంచి జరుగనుంది. అందుకోసం ఆలయ ట్రస్ట్ అధికారులు పనుల్లో మునిగిపోయారు. ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదాన్ని అందించేందుకు ఆలయ ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు లక్షలకు పైగా కొత్తిమీర తరుగుతో కూడిన…
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 22వ తేదీన జరగబోతుంది. ఈ మెగా ఈవెంట్ కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రవేశ పాస్‌లను జారీ చేసింది. ఎంట్రీ పాస్‌లో క్యూఆర్ కోడ్ ఉంది.
అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా.. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, ప్రముఖ న్యాయవాది పరాశరన్ నుండి అదార్ పూనావాలా వరకు ఐదు వందల మందికి పైగా ప్రత్యేక అతిథులు రానున్నారు. ఈ క్రమంలో.. 100 చార్టర్డ్ విమానాలు రానున్నాయని శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ అంచనా వేస్తుంది. అందుకోసం.. విమానాల పార్కింగ్ కోసం 12 విమానాశ్రయాలను సంప్రదించారు. వీఐపీలను మూడు కేటగిరీలుగా విభజించారు.
2024 జనవరి 22న "ప్రాణ్ ప్రతిష్ఠ" విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. అయితే.. ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడిన విశిష్ట అతిథులందరికీ ప్రత్యేక బహుమతులు ఇవ్వనున్నట్లు ఆలయ ట్రస్ట్ బుధవారం ప్రకటించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం, హాజరైనవారికి పవిత్ర ప్రసాదంతో పాటు, గీతా ప్రెస్ నుండి 'అయోధ్య దర్శన్' పుస్తకం కాపీలను అందించనున్నట్లు చెప్పారు.