Kaleshwaram Pushkaralu : తెలంగాణ సెక్రటేరియట్‌లో ఒక చారిత్రక కార్యక్రమం జరిగింది. కాళేశ్వరంలో జరగనున్న సరస్వతి నదీ పుష్కరాల కోసం అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్, వాల్ పోస్టర్‌లను మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం పుష్కరాల ఏర్పాట్లలో ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధను స్పష్టం చేసింది. మే 15 నుంచి 25 వరకు జరగనున్న ఈ పుష్కరాల కోసం ప్రభుత్వం రూ. 35 కోట్లను కేటాయించి, భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు…
సీతారాముల కల్యాణం కన్నులు పండుగ జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొన్నారు. స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వేదికపై నుంచి సీతారాముల కల్యాణం తిలకించారు. అనంతరం వేడుకును ఉద్దేశించి ప్రసంగించారు. పరిపాలన అంటే రామ పాలన జరగాలని అందరూ కోరుకుంటారన్నారు. "తండ్రి మాటకు కట్టుబడి వనవాసం వెళ్లారు.. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒంటిమిట్ట లో జరుపుకుంటున్నాము.
CM Revanth Reddy : పర్యాటక శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. ఫిబ్రవరి 10 లోగా పూర్తి టూరిజం పాలసీని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది సీఎం రేవంత్ రెడ్డి. దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేసి పాలసీని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణ టూరిజం పాలసీ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎకో, టెంపుల్ టూరిజంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని…