రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రాణహిత పుష్కరాలు కూడా తోడవడంతో గత 10 రోజులుగా రాజన్న ఆలయంలో భక్తుల సందడి పెరిగింది. గత 23 రోజులుగా హుండీ కౌంటింగ్ జరగకపోవడంతో ఆలయంలోని హుండీలన్నీ నిండిపోయాయి. ఈనెల 10న శ్రీరామనవమి ఉత్సవాలు ముగిసిన వెంటనే, ఇన్చార్జి ఈవో రమాదేవి వెళ్ళిపోవడంతో హుండీలను లెక్కించలేదు. ప్రధానాలయం తో పాటు బద్ది పోచమ్మ దేవాలయంలో కూడా హుండీలు నిండిపోయాయి. ఆలయంలో…