Konda Surekha : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని శైవక్షేత్రాల్లో విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రముఖ శివక్షేత్రాల్లో భద్రతా చర్యలు, వసతుల కల్పన, ప్రాంగణ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లను పటిష్టంగా అమలు చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మహా శివరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా…