తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.. చలితో ప్రజలు వణికిపోతున్నారు.. ఇక, అల్లూరి జిల్లా ఏజెన్సీలో చలి వణుకు పుట్టిస్తుంది. రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోయాయి. ఏజెన్సీ వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కురుస్తుంది. మినుములూరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవగా.. పాడేరులో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దట్టమైన పొగమంచు, శీతల గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.