DR Ujwala Dies in Australia: ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి చెందింది. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువ వైద్యురాలు ప్రమాదవశాత్తు లోయలో పడి దుర్మరణం చెందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల (23) అస్ట్రేలియాలో మృతి చెందింది. అంత్యక్రియల నిమిత్తం శనివారం భౌతిక కాయాన్ని ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి తీసుకొస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వేమూరు ఉజ్వల ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లోని బాండ్ విశ్వవిద్యాలయంలో…