శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాయుడి గారి తాలుకా’ ఉలిశెట్టి మూవీస్ బ్యానర్‌పై కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగంగా దూసుకుపోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘జాతరొచ్చింది’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మాస్ బీట్ పాటకు గురుబిల్లి జగదీష్ సాహిత్యం అందించగా, నగేష్ గౌరీష్ హుషారైన సంగీతాన్ని సమకూర్చారు. గాయని…
పచ్చని పొలాలు… పట్టు చీరలు కట్టిన ఆడపడుచులు. పసిపిల్లల నవ్వులు, పరవళ్లు తొక్కే చెరువులు… ఇవి మన పల్లె వాతావరణానికి చిహ్నాలు. కానీ ఇప్పటి టాలీవుడ్ పల్లె కథలు. కేవలం అందాల్ని కాదు, అంతర్లీన భావోద్వేగాల్ని తెరపైకి తీసుకొస్తున్నాయ్.టాలీవుడ్ లో ఇప్పుడు పల్లెటూరి ఫీవర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సమంత, రానా దగ్గుబాటి, కీర్తి సురేష్, కిరణ్ అబ్బవరం లాంటి నటులు ఇప్పుడు గ్రామీణ కథలతో, ఆ నేటివ్ ఫీలింగ్‌తో ప్రేక్షకులకు దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నారు. సమంత నిర్మించిన ఫస్ట్…