శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాయుడి గారి తాలుకా’ ఉలిశెట్టి మూవీస్ బ్యానర్‌పై కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగంగా దూసుకుపోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘జాతరొచ్చింది’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మాస్ బీట్ పాటకు గురుబిల్లి జగదీష్ సాహిత్యం అందించగా, నగేష్ గౌరీష్ హుషారైన సంగీతాన్ని సమకూర్చారు. గాయని జయశ్రీ పల్లెo ఆలపించారు.
పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ జాతర పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని ఉలిశెట్టి నిత్యశ్రీ, ఉలిశెట్టి పునర్వికా వేద శ్రీ, నవీన్ శ్రీ కొర్రపాటి, పీజే దేవి,కరణం పేరినాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సుమన్, కిట్టయ్య, ఆర్.కే నాయుడు, సలార్ పూజ, కరణం శ్రీహరి, ఉలిశెట్టి నాగరాజు, సృజనక్షిత వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.