జెమిని ప్రొడక్షన్ సంస్థ యువ ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో కంటెంట్ బేస్డ్ సినిమాలను రూపొందించడానికి సిద్ధమైంది. అందులో భాగంగా సరికొత్త కథాంశాలకు ప్రాధాన్యమిస్తూ సినిమాలు నిర్మిస్తోంది. తాజాగా ఆ సంస్థ సహకారంతో గుడాల నవీన్ ‘రేంజ్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న ఈ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ లో యంగ్ హీరో చైతన్య వంశీ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. హేమంత్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బుధవారం ఈ సినిమా పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది.…