రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ది రాజాసాబ్’ సందడి మొదలైంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘సహనా.. సహనా..’ అనే మెలోడీ సాంగ్‌ను విడుదల చేసిన సందర్భంగా చిత్ర యూనిట్ ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘ప్రభాస్ ఎప్పుడూ తన అభిమానుల గురించే ఆలోచిస్తుంటారు. వారిని ఎలా అలరించాలి, వారికి ఎలాంటి వినోదాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎంతో శ్రమిస్తారు. ఈ సంక్రాంతికి రాజాసాబ్‌తో…