ధర్మసాగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ మాట్లాడుతూ.. ప్రజలందరూ కేసీఆర్ కు అండగా కడియం ను గెలిపిస్తే అందరినీ మోసం చేసిండని ఆయన మండిపడ్డారు. డబ్బులకు లొంగి , పదవుల పేరుతో బిఆర్ఎస్ కు , తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదకారిగా కడియం తయారయ్యాడని పల్లా వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో , మాదిగ పోరాట సమితి ఉద్యమంలో లేడు కానీ నేనే గొప్ప అని చెబుతూ అహంకారంతో అందరినీ మోసం చేస్తున్నాడని,…
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడిన నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ టికెట్ కేటాయించలేక ఈ మూడు పార్టీలు అసంతృప్త జ్వాలలను ఎదుర్కొంటున్నాయి. అనంతపురం అర్బన్ టీడీపీలో టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి.
గత ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్స్ లో తలపడ్డాయి. అయితే.. ఆ మ్యాచ్ ను విజేతగా నిలపడంలో రవీంద్ర జడేజా ఆడిన ఆటతీరు వల్లే.. చివరి ఓవర్ లో జడేజా బౌండరీలు కొట్టి ఫైనల్ లో గెలిపించాడు. దీంతో.. ఎంఎస్ ధోనీ ఆలింగనం చేసుకుని.. పైకి ఎత్తుకున్నాడు. కాగా.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి…
చరిత్ర సృష్టించేందుకు కేకేఆర్ స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ సునీల్ నరైన ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. ఈరోజు ఆర్సీబీతో జరిగే మ్యాచ్ లో ఆ ఫీట్ సాధించనున్నాడు. ఈ మ్యాచ్ తో టీ20ల్లో 500 మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా నిలువబోతున్నాడు. కాగా.. ప్రపంచ క్రికెట్ లో ఈ ఫీట్ ముగ్గురు మాత్రమే సాధించారు. కాగా.. ఈరోజు జరగబోయే మ్యాచ్ లో సునీల్ నరైన్ నాలుగోవాడు కానున్నాడు.
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడిన నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ టికెట్ కేటాయించలేక ఈ మూడు పార్టీలు అసంతృప్త జ్వాలలను ఎదుర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది.
నల్లగొండ పార్లమెంట్ స్థానాన్ని భారతదేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలుస్తామని సూర్యాపేటలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అన్ని ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటుందని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవడం ఖాయమన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీజేపీ…
తెలంగాణలో గంజాయి స్మగ్లర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడిక్కడా తనిఖీలు చేపడుతున్నారు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకొని మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో పరిధిలో 3 కిలోల గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వండర్లా పరిసర ప్రాంతంలో మంగల్ఘడ్ , దూల్పేట్ ,వివిధ ప్రాంతాల నుండి రాజాసింగ్, ఉప్పు లోకేష్ ఇద్దరు…
అమెరికాకు చెందిన ఓ మహిళ డెల్టా ఎయిర్లైన్స్ సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు చేశారు. లో దుస్తులు ధరించని కారణంగా తనను విమానం నుంచి దింపేస్తామన్నారని అన్నారు. ఇది వివక్షే.. కానీ మరొకటి కాదని మహిళ మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బాధిత మహిళ లిసా ఆర్చ్బోల్డ్ (38). బ్యాగీ జీన్స్, లూజ్ టీషర్ట్ తో లోపల బ్రా ధరించకుండానే విమానం ఎక్కారు. అయితే.. అది గమనించిన మహిళా సిబ్బంది ఆమెను తన ఎద బయటకు కనిపించనప్పటికీ కూడా.. కవర్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను బరిలో నిలిచిన పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. మార్చి 30 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు పవన్ తొలి విడత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
ముంబై ఇండియన్స్ జట్టుకు ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడా ఫ్యాన్సే ఆ జట్టును తిట్టిపారేస్తున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీగా ఉన్నప్పటి జట్టులా అనిపించట్లేదు. కొత్త సారథి హార్థిక్ పాండ్యా జట్టులో చేరడంతో రెండు వర్గాలుగా చీలిపోయినట్లు తెలుస్తోంది. అసలు ముంబై జట్టులో ఏం జరుగుతుంది..? వీళ్ల విభేదాలతో కనీసం ప్లే ఆఫ్ కు చేరేలా పరిస్థితి కనపడటం లేదు.