తెలంగాణకు న్యాయంగా దక్కవలసిన నదీ జలాల వాటాను సాధించుకోవడంలో ఉమ్మడి రాష్ట్రంలో నాటి ఆంధ్రా నాయకత్వ స్వార్థంతో పాటు, తెలంగాణ నాయకత్వం అనుసరించిన నిర్లక్ష్య ధోరణి సోయిలేని తనం ప్రధాన కారణాలుగా మారి తెలంగాణ రైతాంగానికి దశాబ్దాల పాటు నష్టాన్ని కలిగించిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్‌కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనుమతి ఇచ్చారు. చంద్రబాబు నిర్వహించిన భేటీలో అనుమతి ఇచ్చారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని చెప్పారు. రాజధాని ఔటర్ రింగ్ రోడ్‌కు కూడా నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు.
కే.కేశవరావును తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో ఉన్న ఈ ఇరువురు నేతలు కలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ నా సొంత ఇల్లు.. నేను కాంగ్రెస్ మనిషిని' అని అన్నారు. ఇప్పుడు స్వేచ్చ ఫీలింగ్ ఉంది.. కాంగ్రెస్ ఎంపీలతోనే తెలంగాణ వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ లోకి వచ్చినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
మల్కాజ్గిరి మరోసారి రాజకీయ కక్షలతో రణరంగంగా మారింది. మల్కాజ్గిరి నియోజకవర్గం మౌలాలి ఆర్టీసీ కాలనీలో రోడ్డు పనులను సందర్శించడానికి వెళ్లిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పై మౌలాలి కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించారు. గత కొంతకాలంగా మౌలాలి డివిజన్ లోని ఆర్టీసీ కాలనీ రోడ్లు మరమ్మతులకు నోచుకోలేదు, తద్వారా స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు.
తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వరంగల్ ఆఫీస్ ను మంత్రి శ్రీధర్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీన్ని ఆఫీస్ అంటారా..? ఇన్ని రోజులు అధికారులు ఏం చేస్తున్నారు..? అంటూ అధికారులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయినా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వరంగల్ ఆఫీస్ దుస్థితి ఇలా ఉందని అధికారులను నిలదీశారు మంత్రి శ్రీధర్ బాబు.
పాలస్తీనా అనుకూల మద్దతుదారులు గురువారం ఆస్ట్రేలియా పార్లమెంట్ హౌస్ పైకప్పు పైకి ఎక్కారు. ముదురు దుస్తులు ధరించిన నలుగురు వ్యక్తులు ఆస్ట్రేలియా పార్లమెంటు పైకప్పుపైకి ఎక్కి బ్యానర్లు కట్టారు. బ్యానర్లలో పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు ఉన్నాయి.
హత్రాస్ తొక్కిసలాటలో బాధితులందరి మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ కుమార్ గురువారం వెల్లడించారు. మంగళవారం హత్రాస్‌లో బోధకుడు నారాయణ్ సకార్ హరి లేదా భోలే బాబా నిర్వహించిన సత్సంగం తర్వాత జరిగిన తొక్కిసలాటలో మొత్తం 123 మంది మరణించారు.
హత్రాస్‌లో సత్సంగం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం తెలిపారు. వీరంతా సత్సంగాన్ని నిర్వహించే ఆర్గనైజింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ నిందితుడు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. చంచల్ గూడా జైల్లో ఉన్న రాధాకృష్ణ రావును పీటీ వారెంట్ పై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.