Raj Tarun : ఎవరి ఆరోపణల్లో నిజమెంత…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు పొంది పలువురు దర్శక – నిర్మాతల దృష్టిని ఆకర్షించి ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు రాజ్‌తరుణ్. అలా మొదటి చిత్రం విరించి వర్మ దర్శకత్వంలో అన్నపూర్ణ , సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ‘ఉయ్యాలా జంపాల’ చిత్రం ద్వారా హీరోగా మారాడు. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టి, వరుస అవకాశాలను అందిపుచ్చుకొని ఫుల్ బిజీ హీరో అయ్యాడు రాజ్‌తరుణ్.
ఒక హిట్ రెండు ప్లాప్ లు అన్నట్టు సాగుతోంది కుర్ర హీరో సినీ కెరీర్. ఈ తరుణంలో ఈ హీరోపై లావణ్య అనే యువతి సంచలన ఆరోపణలు చేసారు. రాజ్‌తరుణ్ సినిమా అవకాశాలకు కోసం హైదరాబాద్ కి వచ్చిన రోజుల్లో తాను ఆశ్రయం కల్పించాను, ఆర్ధికంగా రాజ్‌తరుణ్ కు ఎంతో సాయం చేశాను, నన్ను పెళ్లి చేసుకుంటాను అంటే నమ్మాను, కానీ ఇప్పుడు హీరోగా గుర్తింపు దక్కించుకొన్నాక ఓ హీరోయిన్ తో సంబంధం పెట్టుకొని తనను దూరం పెట్టాడు. చివరికి నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడని లావణ్య నార్సింగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
Also Read
కాగా యంగ్ హీరో వాదన మరోలా ఉంది. లావణ్య తనకు వైజాగ్‌లో ఉంటుండగా ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయింది, సినిమా ఛాన్స్‌ల కోసం పరిశ్రమకు వచ్చిన రోజుల్లో సహాయం చేసింది, అంతే తప్ప ఆమెతో నాకు ఎటువంటి ఫిజికల్ రేలషన్ లేదు. లావణ్య వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని విడిపోయి తిరిగి ఆ వ్యక్తిపైనే గుంటూరు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. దానికి సంబందించిన FIR కాపీ తన వద్ద ఉంది. లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉంది, వద్దని వారించినందుకు తనతో గొడవపడింది, గతంలో ఓ సారి డ్రగ్స్ కేసులో కూడా అరెస్ట్ అయిందని అన్నాడు. లావణ్యపై తానూ లీగల్ పోరాటానికి వెళతానని రాజ్ తరుణ్ వెల్లడించారు
ఒకరిపై ఒకరి ఆరోపణలతో ఓ చిన్నపాటి సినిమా స్టోరీని తలపిస్తున్న లావణ్య – రాజ్‌తరుణ్‌ల వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఎవరి మాటల్లో ఎంత నిజముందో రానున్న రోజుల్లో తేలనుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!