రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం అని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలగా.. తన సమస్యకు పరిష్కారం చూపడం లేదనే ఆవేదనతో నిన్న సీఎం సొంత జిల్లాలోనే…
రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన ఏఈఈ (సివిల్) పరీక్షల ఎంపిక జాబితాను ప్రకటించడంలో జాప్యాన్ని ప్రశ్నిస్తూ , ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు బుధవారం అన్నారు. దాదాపు 22 నెలల క్రితమే ఈ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైందని, గతేడాది సెప్టెంబరు నాటికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయిందని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున అభ్యర్థుల తుది జాబితా విడుదలను నిలిపివేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి…
టెట్, డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. ప్రిపరేషన్ కు సమయం ఏపీలో టెట్, మెగా డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. ఈ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలను ప్రకటించనుంది. మంత్రి నారా లోకేష్‌ను కలిసి టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సన్నద్దమయ్యేందుకు మరింత సమయం కావాలని అభ్యర్థులు కోరారు. ఈ క్రమంలో.. టెట్, మెగా డీఎస్సీ సన్నద్ధతకు సమయమిచ్చే అంశంపై విద్యా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. అభ్యర్థుల వినతిని పరిగణనలోకి తీసుకున్న మంత్రి లోకేష్..…
మియాపూర్‌లో గ్యాంగ్ రేప్ కేసు పురోగతి లభించింది. గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసులు మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ కంపెనీ సేల్స్ మెన్ లు గ్యాంగ్ రేప్ పాల్పడ్డారని, సైట్ విజిట్ కోసం అని చెప్పి యువతిని హాస్టల్ నుంచి పికప్ చేసుకున్నారని తెలిపారు. యాదగిరిగుట్ట వద్ద నిర్మానుష భవనం లో కారుని నిలిపివేశారని, కారు చెడిపోయిందని చెప్పి యువతికి సాకుగా చూపెట్టారని పోలీసులు పేర్కొన్నారు.…
ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ (APPSC ) ప్రకటన చేసింది. జులై 28వ తేదీన నిర్వహించే గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వీరందరి అభ్యర్థన దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని పలువురు కోరారు. ఈ క్రమంలో.. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేశారు. తదుపరి పరీక్షా తేదీని త్వరలో తెలుపుతామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. జూలై 28న నిర్వహించాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను…
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ నెల 8 నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి రానుంది. తిరిగి ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తుంది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల హామీ మేరకు ప్రజలకు ఫ్రీగా ఇసుక అందించనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం.. కలెక్టర్ల అధ్యక్షతన లోడింగ్, రవాణ ఛార్జీల నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం చంద్రబాబు ఆదేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత…
చంద్రబాబు.. నితీష్ తో మోడీ మూడోసారి ప్రధాని అయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 400 సీట్లు గెలుస్తాం అని చెప్పిన మోడీకి మూడోసారి ప్రధాని అయ్యిన ఆనందం లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు అపాయింట్ మెంట్ అడిగితే కూడా ఇవ్వని మోడీ.. చంద్రబాబు బలంతో ప్రధాని అయ్యారని జగ్గారెడ్డి విమర్శించారు. పవన్ కల్యాణ్‌ని ముందు పెట్టి… టీడీపీ ని కలుపుకుని బీజేపీ గేమ్ ఆడిందని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ ప్రధాని…
అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తున్నా హామీలు అమలు చేయడం లేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారని, వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన కాంగ్రెస్ హామీల అమలు ఏమైంది ? అని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ 9న రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పారు… కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఇచ్చిన మ్యానిఫెస్టో మీద, సోనియా మీద, ఇందిరా గాంధీ మీద కూడా…
Multivitamins: కొంతమంది రోజూవారీగా మల్టీవిటమన్లను తీసుకుంటారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయని, వ్యాధుల బారిన పడమని అనుకుంటారు. అయితే ఇలా రోజు మల్టీవిటమిన్లు తీసుకోవడం వల్ల ప్రజలు ఎక్కువ కాలం జీవించడంతో సాయం చేయడని, వాస్తవానికి ముందస్తు మరణాన్ని పెంచే అవకాశం ఉందని ఒక అధ్యయనం కనుగొంది.