తెలంగాణ ప్రాంతం అనేక ఉగ్రవాదాల పీడిత ప్రాంతమని మురళీధర్ రావు అన్నారు. కేసీఆర్ ప్రకటించిన విధంగా బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని తెలిపారు. అయితే బీఆర్ఎస్ ఇజ్రాయెల్, ఉగ్రవాదం పై ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన ఇద్దరు దూరదృష్టి గల హైస్కూల్ విద్యార్థులు రిత్విక్ జంపన, సిదీష్ రెడ్డిలు మొట్ట మొదటి పబ్లిక్ ఇ-వేస్ట్ కలెక్షన్ బిన్ను రూపొందించారు. దానిని హైదరాబాద్లో చే శక్తి వంతమైన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ (ఎన్జీఓ) సివిటాస్ మొట్ట మొదటి పబ్లిక్ ఇ-వేస్ట్ కలెక్షన్ బిన్ను ప్రారంభించినట్లు సగర్వంగా ప్రకటించింది.
పెండింగ్ అభ్యర్థుల 5 స్థానాలను మూడు నాలుగు రోజుల్లో ప్రకటిస్తామని కేటీఆర్ చిట్ చాట్లో తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన తమ అభ్యర్థులు ప్రజల్లో ఉన్నారని.. ప్రచారంలో దూసుకుపోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి 40 చోట్ల అభ్యర్థులు లేరని.. కానీ 70 స్థానాల్లో గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని పేర్కొన్నారు. అది చూసి ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు నవ్వుకుంటున్నారని విమర్శించారు.
వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైయస్ జగన్ కీలక సమీక్ష నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్షపై అధికారులు సీఎంకు వివరాలందించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 1,22,69,512 కుటుంబాలను ఆరోగ్య సిబ్బంది సర్వే చేశారు. ఇప్పటి వరకూ మొత్తంగా 3,17,65,600 మందిని ఆరోగ్య సిబ్బంది కవర్ చేశారు.
తెలంగాణలో బదిలీ చేసిన స్థానాల్లో అధికారులను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీలు, సీపీలు, కలెక్టర్లను నియమిస్తూ లిస్ట్ పంపింది. అందులో హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్యాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక.. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా సునీల్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్గా జ్యోతి బుద్ధ ప్రకాశ్, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్గా క్రిస్టినా పేర్లను ప్రకటించింది.
పసుపు సనాతన ధర్మం.. పసుపు బోర్డు తన రాజకీయ పునాది అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఉత్తరప్రదేశ్లో మూసిన చక్కర ఫ్యాక్టరీ తెరిపించిన ఘనత బీజేపీదేనన్నారు. ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ తాళలు తెరిపిస్తానని.. ఈ ప్రాంత రైతులకు మళ్ళీ పూర్వ వైభవం తెస్తానని తెలిపారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను వీఆర్ఏ సంఘం నాయకులు కలిసి కృతజ్ఙతలు తెలిపారు. రద్దు అయిన డీఏను పెంచి మరీ ఇస్తుండడంపై సీఎంను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
సెప్టెంబర్ 2023కి సంబంధించి 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'ని ఐసీసీ ప్రకటించింది. ఈసారి శుభ్మాన్ గిల్ను ఈ నెల ఉత్తమ ఆటగాడిగా ఎంపిక చేశారు. సహచర ఆటగాడు మహ్మద్ సిరాజ్, ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్లను పక్కకు నెట్టి శుభ్మాన్ ఈ టైటిల్ను సాధించాడు.