BEML రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందులో ఇన్స్టిట్యూట్లోని ఎగ్జిక్యూటివ్‌తో సహా ఇతర పోస్టులపై రిక్రూట్మెంట్ జరుగుతుంది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభంకానుంది. అయితే దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక సైట్ bemlindia.in ను సందర్శించి రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దేశ వ్యాప్తంగా ద్రవ్యోల్బణంతో ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ సంస్థలు అనేక నగరాల్లోని ప్రజలకు చౌక ధరలకు ఉల్లిపాయలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ-ఎన్సీఆర్లో నివసించే ప్రజలకు కిలో ఉల్లిని కేవలం 25 రూపాయలకే అందించనుంది.
ఈ దీపావళికి బీఎస్ఎన్ఎల్ ధమాకా ఆఫర్ అందిస్తుంది. రూ.251, రూ.299, రూ.398 ప్లాన్లతో రీఛార్జ్ చేయడం వల్ల అదనంగా డేటా కూడా లభించనుంది. ఇదే విషయమై.. బీఎస్ఎన్ఎల్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. అయితే బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ పోర్టల్‌లో రీఛార్జ్ చేస్తేనే అదనపు డేటా లభించనుంది.
ప్రపంచ కప్ 2023లో భాగంగా ఈరోజు న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాక్.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో వర్షం రెండుసార్లు రావడంతో అంఫైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటిసారి వర్షం పడినప్పుడు ఓవర్లను 41కి కుదించగా, లక్ష్యాన్ని కూడా 342కు తగ్గించారు. ఈ క్రమంలో మరోసారి వర్షం పడుతుండటంతో పాకిస్తాన్ విజేతగా ప్రకటించారు.
ఈరోజు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ ఫఖార్ జమాన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన పాకిస్తాన్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేవలం 63 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఇమ్రాన్ నజీర్ పేరిట ఉండేది.
ప్రపంచకప్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే వరుణుడు ఒక్కసారి అడ్డుతగలగా.. మరోసారి ప్రత్యక్షమయ్యాడు. దీంతో మళ్లీ ఆటను ఆపేశారు.
కాంగ్రెస్ పార్టీకి విచక్షణ లేదు, అవగాహన లేదు, ఆలోచన లేదు, అనుభవం లేదన్నారు బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య. ఇవాళ జనగామ జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అహంకారంతోనే చేసే పనితోటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయిందని, breaking news, latest news, telugu news, Ponnala Lakshmaiah, big news, brs,