కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీపై వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎంపీ విజయసాయి రెడ్డి నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలిశారు. ఏపీలో టీడీపీ దొంగ ఓటర్లను చేర్పించిందని ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
మిచౌంగ్ తుఫాను వల్ల ఏపీలో రైతులకు చాలా నష్టం సంభవించిందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. 15 జిల్లాల్లో 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. తుఫాను హెచ్చరికలు చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్నారు. హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుంటే పంట నష్టం, ప్రాణ నష్టం తగ్గించొచ్చన్నారు. పంట నష్టాన్ని నివారించే పరిస్థితులున్నా.. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు.
2023-24 ఇంటర్, పదవ తరగతి పరీక్షలు మార్చి నెలలో నిర్వహించనున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సాధారణ ఎన్నికల షెడ్యూల్ వల్ల పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలిశారు. ఎంపీ విజయసాయి రెడ్డి నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలిశారు. ఏపీలో టీడీపీ దొంగ ఓటర్లను చేర్పించిందని ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
Malla Reddy: ఇది ప్రభుత్వ కక్ష చర్య కాదని భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూకబ్జా ఆరోపణలపై మల్లారెడ్డి స్పందించారు. భూ కబ్జాతో నాకు ఎటువంటి సంబంధం లేదన్నారు.
ఈరోజు లోక్‌సభలోకి ఆగంతకులు చొచ్చుకునిపోయిన సంఘటన తెలిసిందే. ఇదే విషయమై సాయంత్రం ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రొటెం స్పీకర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ అత్యవసర సమావేశంలో ఆగంతుకుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో ఈ తరహా సంఘటనలు జరగకుండా తీసుకోవల్సిన భద్రత చర్యలపై ప్రోటెం స్పీకర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో సామాజిక సాధికారిక యాత్ర బహిరంగ సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రసంగించారు. పాతపట్నంలో ఈ జనవాహిని చూస్తుంటే సముద్రం పొంగివచ్చిందా అన్న రీతిలో హాజరయ్యారన్నారు. పార్టీ పట్ల, జగన్ పట్ల, మీ నాయకురాలి పట్ల అభిమానం కనపడుతోందన్నారు.
అత్యంత భద్రత కల్గిన భారత దేశ పార్లమెంటులో ఆగంతకులు కలకలం సృష్టించిన సమాచారం వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. రాజమండ్రిలో భరత్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారానికై తగు మార్గ దర్శకాలను ప్రతిపాదించేందుకు గాను ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ధరణి పనితీరు, భూ సంబంధిత అంశాలపై సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు దామోదర రాజ నర్సింహా, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, తదితర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు…
ఇంఛార్జ్‌ల మార్పులతో కొంతమందిలో బాధ, ఆవేదన ఉంటుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అన్ని సర్దుకుంటాయన్నారు. టీడీపీ రాజకీయ పార్టీగా ఉనికి కోల్పోయిందని.. ఒక ముఠాగా మారిందని విమర్శించారు.