విచారణకు సంబంధించి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన విజ్ఞప్తిపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. ఆయన అభ్యర్థన మేరకు తెలంగాణ మహిళా కమిషన్ విచారణను ఈ నెల 18కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌లో విషాదం చోటు చేసుకుంది. జలాశయంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. శివాలయం పుష్కర్‌ఘాట్ వద్ద వీరు ఈత కోసం వెళ్లి గల్లంతయ్యారు.
సికింద్రాబాద్ రైలు నిలయంలోని పాత క్వార్టర్స్‌లో మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలోని చెత్తకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరుగుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేటలోని డెక్కన్ నైట్ వేర్ దుకాణంలో రెండు రోజులు గడుస్తున్నా మంటలు అదుపులోకి రాలేదు. నిన్నటి నుంచి ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్న మంటలు అదుపులోకి రావడం లేదు. నిన్న మధ్యాహ్నం ఒక్కసారిగా డెక్కన్ నైట్ వేర్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది.
ఎయిర్‌పోర్ట్ మెట్రో పనులను వేగవంతం చేయడానికి సమాంతరంగా అనేక ముందస్తు నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయని, అవి శరవేగంగా సాగుతున్నాయని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) MD శ్రీ NVS రెడ్డి ప్రకటించారు.
Bhadrachalam Temple: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయం భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. సెలవు రోజు కావటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో కదిలి రావడంతో ఆలయ ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. ఆలయ అర్చకులు లక్ష్మణ సమేత సీతారాముల మూలమూర్తులను పంచామృతాలతో అభిషేకం నిర్వహించి.. బంగారు పుష్పాలతో అర్చన చేశారు. ఇవాళ వైకుంఠ ఏకాదశి…
రంగారెడ్డి జిల్లా ఆదిభట్లకు చెందిన డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నవీన్‌రెడ్డి సోదరుడు నందీప్‌రెడ్డి అరెస్ట్ చేశారు పోలీసులు. నవీన్‌రెడ్డి, వైశాలి వీడియోలు సర్క్యులేట్ చేశారని, గోవాలో నవీన్‌రెడ్డి వీడియోలను రికార్డు చేసి మీడియాకు పంపారనే పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రావడంతో నందీప్‌రెడ్డి, వంశీభరత్‌రెడ్డిలను అదుపులో తీసుకున్నారు.
మనిషి జీవిన శైలిలో ప్రతీరోజు ఓ మధుర జ్ఞాపకం. 24గంటల్లో మన జీవితంలో సరదాలు, సంతోషాలు, వీటిలో కొన్ని అప్పటికప్పుడు మరచిపోయేవి, మరికొన్ని జీవితాంతం భద్రంగా దాచుకోవాల్సినవి. ఈకరిగేకాలంలో చెదిరిపోని స్మృతులకు ప్రతిబింబాలు ఫోటోలు. ఈ కరిగేకాలంలో చెదిరిపోని స్మృతులకు ప్రతిబింబాలే మన ఫోటోలు. అనాటి మధుర జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ తనివితీరా వీక్షించేందుకు అవకాశాలన్ని ఇచ్చే తీపిగుర్తులు ఫోటోలు. మనం మాట్లాడే మాటలు, పదాలు కొన్నాళ్లకు మరచిపోతాం. కానీ.. ఓఫోటోను చూస్తే ఎంతోకాలం మదిలో ముద్రవేసుకుపోతుంటాయి.…