తెలుగు సినీ సంగీత ప్రపంచానికి అపారమైన సేవలు అందించిన ప్రముఖ గాయని రావు బాలసరస్వతి (97) ఇక లేరు. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో ఆమె తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు ఈ వార్తను అధికారికంగా వెల్లడించారు. 1928లో జన్మించిన బాలసరస్వతి చిన్న వయసులోనే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. కేవలం ఆరేళ్ల వయసులోనే పాడటం ప్రారంభించి, అద్భుతమైన స్వరం తో అందరినీ ఆకట్టుకున్నారు. ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా తెలుగు ప్రజలకు పరిచయమై, తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందారు.…