మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసింది. తాజాగా ఈరోజు నుంచి ఆయన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతున్న ఈ షూట్‌లో…